నర్సాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనులు వేగవంతం చేసి ఈ నెల 10లోపు కేంద్రాలను మూసి వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. ఆయన శనివారం స్థానికంగా మూతపడిన షుగర్ కంపెనీలోని గోదాంను పరిశీలించి మాట్లాడారు. మండలంలోని అన్ని కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్‌కు సూచించారు. తూకం వేసిన ధాన్యంను కేంద్రాల నుంచి గోదాంలకు తరలించాలని, లారీలు సరిపోకపోతే ప్రైవేటు వాహనాలు సమకూర్చుకొని వడ్ల బస్తాలు తరలించాలని అవసరమైతే హమాలీలను పెంచుకోవాలన్నారు. కాగా మండలంలో చేపడుతున్న కొనుగోలు వివరాలను ఆర్డీఓ, తహసీల్దార్ ఆయనకు వివరించారు.


