సీహెచ్‌సీ ప్రారంభించాలని మంత్రికి విజ్ఞప్తి | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌సీ ప్రారంభించాలని మంత్రికి విజ్ఞప్తి

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండల కేంద్రమైన కౌడిపల్లిలో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ భవనాన్ని త్వరగా ప్రారంభించాలని శనివారం హైదరాబాద్‌లో మంత్రి దామోదర రాజనరసింహాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, జిల్లా సర్పంచ్‌ల పోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్‌ కలిసి విజ్ఞప్తి చేశారు. సీహెచ్‌సీ నిర్మాణం పూర్తయిందని, ప్రారంభించి వినియోగంలోనికి తెస్తే రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. దీంతోపాటు కౌడిపల్లి గ్రామానికి సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్త, నాయకులు పుండరీకంగౌడ్‌, మల్లికార్జున్‌గౌడ్‌, భూమయ్యపటేల్‌, వెంకటేశం, దేవెందర్‌, రమేశ్‌, ఆరిఫ్‌, కిశోర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement