గిన్నిస్‌ రికార్డు కోసం పరుగు | - | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ రికార్డు కోసం పరుగు

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

తూప్రాన్‌: గిన్నిస్‌ రికార్డు కోసం ఓ మహిళ 5 వేల కిలోమీటర్ల పరుగు ప్రారంభించింది. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సూఫీ సోఫియా కన్యాకుమారి నుంచి కరంకోరం వరకు చేపట్టిన ‘రన్‌ ఫర్‌ డ్రీమ్స్‌’ మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌కు శనివారం చేరుకుంది. ఈ సందర్భంగా గజ్వేల్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 వేల కిలోమీటర్లను 80 రోజుల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 26 రోజులు పూర్తయినట్లు తెలిపారు. రోజుకు 50 నుంచి 70 కిలోమీటర్లు పరుగెత్తుతున్నట్లు వివరించారు. స్వాగతం పలికిన వారిలో గజ్వేల్‌ రన్నర్స్‌ రమేశ్‌ గౌడ్‌, మధుసూదన్‌, నరేశ్‌, కిరణ్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement