కొత్త వెర్షన్‌లో ఎరువుల బుకింగ్‌ యాప్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్త వెర్షన్‌లో ఎరువుల బుకింగ్‌ యాప్‌

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఎరువుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వెర్షన్‌లో ఎరువుల బుకింగ్‌ మొబైల్‌ యాప్‌ను రూ పొందించినట్లు, జిల్లా వ్యవసాయశాఖ అధి కారి స్వరూపరాణి శనివారం తెలిపారు. ప్రస్తు త వానాకాలం పంట సీజన్‌న్‌ను పురస్కరించుకొని రైతులందరికీ యూరియా, ఇతర రసాయన ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం ఈ వెర్షన్‌ యాప్‌ను అందుబాటులో తీసుకువచ్చిందన్నారు. అందువల్ల రైతులు గతంలో డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తుల ఆహ్వానం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు నూతనంగా మంజూరైన 86 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయు రాలు, ఆయాలుగా విధులు నిర్వహించడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. బోధకులకు గౌరవ వేతనం రూ.8 వేలు, ఆయాలకు రూ.6వేల వేతనం అందించనున్నారు. అర్హత కల్గిన మహి ళా అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 12న సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులను మండల విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

స్కాలర్షిప్‌కు ఏడుగురు విద్యార్థులు ఎంపిక

చిన్నశంకరంపేట(మెదక్‌): మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌స్కూల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్షిప్‌కు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ వాణికుమారి తెలిపారు. మోడల్‌ స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థులు గౌతమ్‌, బిస్వంత్‌, భగవత్‌, దీక్షిత్‌, పావణి, మాధవి ఎంపికై నట్లు తెలిపారు. వీరికి నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్‌ అందనుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆమె అభినందించారు.

మెరుగైన వైద్య సేవలు

అందించాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌.లలితా దేవి

రామచంద్రాపురం(పటాన్‌చెరు): సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌.లలితా దేవి అన్నారు. శనివారం రామచంద్రాపురం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రికార్డులు, నమోదు పుస్తకాలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డా.కల్పన తదితరులున్నారు.

యువకుడికి దేహశుద్ధి

శివ్వంపేట(నర్సాపూర్‌): వివాహిత స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహితను మూడు నెలల నుంచి ఇంటి పక్కనే ఉంటున్న యువకుడు సాదు సురేశ్‌ వేధి స్తున్నాడు. శుక్రవారం ఆ మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా సురేశ్‌ సెల్‌ఫోన్‌లో వీడియో తీయడంతో గమనించిన ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో సురేశ్‌ కోసం వెతికారు. కాగా రాత్రి 10 గంటలకు ఇంటికి రావడంతో ప్రశ్నించగా నేను తీయలేదని చెప్పా డు. దీంతో సెల్‌ఫోన్‌ చెక్‌ చేయగా వీడియో ఉండటంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement