● కుమారుడికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కోసం డిమాండ్
● పోలీసుల చొరవతో కిందకు..
చేగుంట(తూప్రాన్): ఇందిరమ్మ ఇల్లు మంజూరీ చేసి , తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు ఇలా... మండలంలోని పొలంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ మారబోయిన నర్సింహులుకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు అనీల్ మృతి చెందాడు. చిన్న కుమారుడు అరుణ్ చదువుకున్నా ఉపాధి కోసం కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడికి ఉపాధి కల్పించాలని అధికారులను కోరుతూ వస్తున్నాడు. శనివారం గ్రామ శివారులో విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సాయంత్రం వరకు టవర్ దిగకపోవడంతో రామాయంపేట సీఐ సైదా, చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి గ్రామానికి చేరుకొని నర్సింలుకు నచ్చజెప్పినా వినలేదు. ఎంపీడీఓతో మాట్లాడి రెండో విడతలో నర్సింలుకు ఇల్లు మంజూరీ చేయాలని కోరారు. గ్రామ సమీపంలోని ఓ ఫార్మా పరిశ్రమలో అరుణ్‌కు ఉపాధి కల్పించాలని పరిశ్రమ నిర్వాహకులతో సీఐ మాట్లాడారు. దీంతో శాంతించిన అతడు టవర్‌పై నుంచి కిందికి దిగాడు. గ్రామస్తులు పోలీసులు ఊపిరి పీల్చుకుని నర్సింహులును ఇంటికి పంపించారు.
సెల్ టవర్ ఎక్కిన నర్సింహులు


