వంటగ్యాస్‌ కోసం తోపులాట | - | Sakshi
Sakshi News home page

వంటగ్యాస్‌ కోసం తోపులాట

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

నారాయణఖేడ్‌: ఖేడ్‌ పట్టణంలో భారత్‌ గ్యాస్‌ కార్యాలయం వద్ద గ్యాస్‌ బుకింగ్‌ కోసం వినియోగదారుల మధ్య శనివారం తోపులాట చోటు చేసుకుంది. కొద్ది నెలలుగా వంట గ్యాస్‌ కొరత ఏర్పడటంతో ఆన్‌లైన్‌ బుకింగ్‌తోపాటు వినియోగదారులకు ఓటీపీ విధానంతో గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. అయినా సింగిల్‌ సిలిండర్‌ ఉన్న వారు గ్యాస్‌ అయిపోగానే వంటగ్యాస్‌ తక్షణం అవసరం ఉండటంతో సిలిండర్‌ బుక్‌ చేసుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. డబుల్‌ సిలిండర్‌ ఉన్నవారికి 35 రోజులు, సింగిల్‌ సిలిండర్‌ ఉన్నవారికి 25 రోజులకే బుక్‌ అవుతుందని పేర్కొంటున్నా.. 45 రోజుల తర్వాతనే బుక్‌ అవుతుందని వినియోగదారులు వాపోయారు. కాగా వంటగ్యాస్‌ కోసం భారత్‌గ్యాస్‌ ఏజెన్సీకి వచ్చిన ప్రజలు సిలిండర్ల బుకింగ్‌ కోసం కార్యాలయం వద్ద తోపులాటకు దిగారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డిస్ట్రిబ్యూటర్‌ మహిపాల్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా.. ఖేడ్‌లో 35వేల కనెక్షన్లు ఉన్నాయని, నిత్యం 342 సిలిండర్లు సరఫరా జరుగుతుందన్నారు. ప్రస్తుతం 1,500 మంది బుక్‌ చేసుకున్న వారు వెయిటింగ్‌లో ఉన్నారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement