పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత చిరస్మరణీయుడు ఎల్లయ్య ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలి లాసెట్‌లో వర్షిణికి 2వ ర్యాంకు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర

సంగారెడ్డి టౌన్‌: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కోర్టులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పర్యావరణాన్ని పెంపొందించడంతోపాటు వనమహోత్సవం లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రామచంద్రాపురం(పటాన్‌చెరు): జీవితాంతం కార్మికుల సంక్షేమం, తెలంగాణ కోసం ఆలోచించిన నిస్వార్థ నాయకుడు జి.ఎల్లయ్య అని అందుకే నేడు పార్టీల కతీతంగా అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని మాజీమంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. తెల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని జీ బ్లాక్‌లో శుక్రవారం జరిగిన కార్మిక నేత జి.ఎల్లయ్య 85వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్లయ్య కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ శాసనమండలి ప్రోటెమ్‌ చైర్మన్‌ వి.భూపాల్‌ రెడ్డిలతో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లయ్య కార్మిక నాయకుడిగానే కాకుండా చివరిశ్వాస వరకు నిలిచిన గొప్ప తెలంగాణ ఉద్యమ యోధుడన్నారు. భెల్‌ పరిసర ప్రాంతంలో ఆయన పేరు తెలియని వారు లేరని, ఒక సాధారణ కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన జాతీయస్థాయి కార్మిక నేతగా ఎదిగారని వివరించారు. ప్రస్తుతం ఆవిష్కరించిన ఎల్లయ్య విగ్రహం ఆయన స్థాయికి తగినట్టుగా లేదని త్వరలోనే మంచి స్థలంలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దాని బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇస్తున్నట్లు తెలిపారు.

మెదక్‌ పార్లమెంట్‌ సభ్యులు

ఎం.రఘునందన్‌రావు

రామచంద్రాపురం(పటాన్‌చెరు): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, తెల్లాపూర్‌ను ప్లాస్టిక్‌రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎంపీ ఎం.రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. తెల్లాపూర్‌ డివిజన్‌లో శుక్రవారం సాయంత్రం తేనా గ్రీన్‌ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ప్లాస్టిక్‌ వినియోగం వల్ల జరిగిన అనర్థాలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. ఐటీ ఉద్యోగులు పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌ఆర్మీ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహించడం హర్షదాయకమన్నారు. కార్యక్ర మంలో దిశ కమిటీ సభ్యడు కాసర్ల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరుకు చెందిన వర్షిణీరెడ్డి ఐదేళ్ల లాసెట్‌ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి ప్రతిభ చాటుకుంది. కేవలం నెలరోజుల పాటు ప్రణాళికాబద్ధంగా చదివి ఈ ఘనత సాధించినట్లు ఆమె వెల్లడించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, తండ్రి కొల్కూరి శంకర్‌సేన్‌రెడ్డి కోరిక మేరకు లాసెట్‌ పరీక్షకు హాజరైనట్లు తెలిపింది. వర్షిణీరెడ్డి మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి మనవరాలు కావడం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement