సంత.. తీరిన చింత | - | Sakshi
Sakshi News home page

సంత.. తీరిన చింత

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

సంత.. తీరిన చింత

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ మండలంలోని మల్‌చెల్మ గ్రామంలో ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న వారాంతపు సంతకు విశేష స్పందన లభిస్తోంది. సంతలో అన్ని వస్తువులు లభిస్తుండటంతో ప్రజలకు పట్టణానికి వెళ్లే బాధ తప్పింది. మల్‌చెల్మతోపాటు పరిసర గ్రామాల ప్రజలు కనీసం కూరగాయలు కొనుగోలు చేసేందుకు సైతం జహీరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామ సర్పంచ్‌తోపాటు పెద్దలు నిర్ణయించి వారాంతపు సంత నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు వారాంతపు ప్రారంభించగా తాజా కూరగాయలతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు, పనిముట్లు, బట్టలు, ప్లాస్టిక్‌ సామగ్రి అందుబాటులోకి వచ్చాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు కొనుగోళ్లకు సంతకు రావడంతో మంచి స్పందన వస్తుంది. వారాంతపు సంత వల్ల తమ చింత తీరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement