తొలకరికి ముందే పత్తి విత్తు పనులు | - | Sakshi
Sakshi News home page

తొలకరికి ముందే పత్తి విత్తు పనులు

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

నారాయణఖేడ్‌: వర్షాకాలం ప్రారంభం కాకముందే రోహిణి కార్తెలోనే రైతులు పత్తి విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈనెల 8న మృగశిర కార్తె ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రైతులు ఆశించి పత్తి సాగు పనులు ప్రారంభించేశారు. నాలుగు రోజుల క్రితం ప్రాంతంలో మోస్తారు వర్షం కురియగా గురువారం భారీ వర్షం కురిసింది. రెండు వర్షాలకు నల్లరేగడి భూములు కాస్త నానడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. నాగల్‌గిద్ద మండలం డోవూరు శివారులో కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తే పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోను పత్తి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈసారి వర్షాలు కాస్త తక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా రైతులు కొంత ముందస్తు వ్యవసాయ పనుల్లో నిగమ్నవుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement