పారదర్శకంగా బదిలీలు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా బదిలీలు

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

పారదర్శకంగా బదిలీలు

జహీరాబాద్‌ టౌన్‌: వైద్యశాఖలో బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వద్ద శుక్రవారం వైద్యులు, నర్సులు నిరసన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..వైద్యుల బదిలీలు ప్రభుత్వ జారీ చేసిన జీఓ నం.38 నిబంధనలకు అనుగుణంగా జరగడంలేదని, ఏకపక్షంగా నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా స్పౌస్‌ బదిలీలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్యులు సమర్పించిన రిక్వెస్టు బదిలీలను మంజూరు చేయాలని కోరారు. పారదర్శకత కోసం ఆఫ్‌లైన్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement