రామాయంపేట(మెదక్): మున్సిపల్ నిధులను స్థానిక అఽధికారులు దుర్వినియోగం చేస్తున్నారని కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కౌన్సిలర్లు నాగరాజు, దేవుని రంజిత్, జిల్లా నాయకులు యాదగిరి, గణేశ్, స్వామి, కోఆప్షన్ సభ్యుడు యాదగిరి శుక్రవారం కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నకిలీ బిల్లులతో రూ.లక్షలు స్వాహా చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ట్రాక్టర్లు, ఆటోలకు డీజిల్ విషయంలో భారీ స్థాయిలో దుర్వినియోగానికి పాల్పడ్డారని, గతంలో ప్రతి నెలా డిజిల్ ఖర్చు రూ. 90 వేల వరకు కాగా, ఈ నాలుగైదు నెలల్లో ఏకంగా రూ. రెండు లక్షలు దాటిందన్నారు. ట్రీ గార్డుల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రజా ప్రతినిధుల పాత్ర ఉందని ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై ఎమ్మెల్యే, కలెక్టర్‌తోపాటు విజిలెన్సు అధికారులకు సాక్ష్యాలతో ఫిర్యాదు చేశామని, త్వరలో విచారణ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
మున్సిపల్ కౌన్సిలర్ల ఆరోపణ


