ప్రకృతి వనరులను సంరక్షిద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వనరులను సంరక్షిద్దాం

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

నర్సాపూర్‌: భవిష్యత్‌ తరాలకు సుస్థిర జీవన వాతావరణాన్ని అందించేందుకు ప్రకృతి వనరులను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని బిట్స్‌ పిలాని హైదరాబాద్‌ క్యాంపస్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ అబ్రదీప్‌ మజుందర్‌ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్‌ కాలేజీలో సేవ్‌ క్లైమేట్‌ అండ్‌ సేవ్‌ ఎర్త్‌ అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ లక్ష్మిప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ సంజయ్‌దూబె, సివిల్‌ ఇంజనీరింగ్‌ హెచ్‌ఓడీ కృష్ణారావు,మేనేజర్‌ బాపిరాజు, ఏఓ సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement