జోరందుకున్న ఖరీఫ్‌ సాగు | - | Sakshi
Sakshi News home page

జోరందుకున్న ఖరీఫ్‌ సాగు

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

మునిపల్లి(అందోల్‌)/జహీరాబాద్‌ టౌన్‌: జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ పనులు జోరందుకున్నాయి. మునిపల్లి మండలంలోని పిల్లోడి, పెద్దలోడి, తాటిపల్లి, మన్‌సాన్‌పల్లి, మేళసంగ్యం గ్రామాలతోపాటు ఆయా గ్రామాల్లో రైతులు కూలీలతో పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఇక జహీరాబాద్‌ వ్యవసాయ డివిజన్‌ పరిధిలో పత్తి విత్తనాలు నాటే పనులు జోరుగా సాగుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో పత్తి విత్తనాలు నాటే కూలీల కొరత ఉండటంతో ఏదోవిధంగా ఖర్చుకు వెనుకాడకుండా అడిగిందే తడవుగా ఆటో ల్లో కూలీలను పొలాలకు తీసుకొచ్చి విత్తనాలు నాటిస్తున్నారు. పత్తి పంటలో వివిధ రకాల గడ్డి, పిచ్చి మొక్కలు మొలకెత్తకుండా ఉండేందుకు విత్తనాలు నాటగానే పత్తి గడ్డిమందు పిచికారీ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement