సంగారెడ్డి/జహీరాబాద్ టౌన్: నూతనంగా జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రోహిణి ని పలు సంఘాల నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు జావిడ్ అలీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, నాయకులు శాలువ, పూలమాలతో సత్కరించారు, అలాగే బీఆర్ ఎస్‌వి నాయకులు అఖిల్ డీఈఓ ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
టీబెస్ నాయకులు కూడా...
తెలంగాణ బంజార ఎంప్లాయిస్ సేవా సంఘం(టీబెస్) నాయకులు డీఈఓ రోహిణిని సంగారెడ్డిలో మర్యాద పూర్వకంగా కలిశారు. టీబెస్ రాష్ట్ర అధ్యక్షుడు పీపీరాథోడ్, ప్రధాన కార్యదర్శి తులసీరాం రాథోడ్ ఆధ్వర్యలో జహీరాబాద్ డివిజన్ నాయకులు అర్జున్ చవాన్ తదితరులు ఆమెను కలిసి శాలువాతో సత్కరించారు.


