చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
సంగారెడ్డి: గిరిజన కుటుంబంపై దాడి ఘటన కలకలం రేపింది. ఈ ఘటన చౌటకూర్ మండలం బొమ్మరెడ్డిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... రాత్రి 10 గంటల సమయంలో గేదె కనిపించకపోవడంతో జాదవత్ వాల్కీబాయి, శివరాం, అరవింద్, అభిలాష్ తదితరులు వెతికేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బొమ్మరాజు అంజయ్య, రమేశ్, విష్ణు, భూమ్మయ్య, తదితరులు మద్యం మత్తులో వచ్చి వారిపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. దాడిలో గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ విషయమై పుల్కల్ ఎస్ ఐ విశ్వజన్‌ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
సిద్దిపేటకమాన్: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్తకు సిద్దిపేట కోర్టు జైలు శిక్షతో పాటు జరిమాన విధించింది. టూటౌన్ సీఐ మురళి వివరాల ప్రకారం... సిద్దిపేట బారాయిమామ్‌కు చెందిన కొత్వాల్ సందీప్‌కు అదే కాలనీకి చెందిన లహరితో 17ఏళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల నుంచి సందీప్ తన భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఈ క్రమంలో లహారి 2017లో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కోర్టు కానిస్టేబుళ్లు శ్రీనివాస్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పీపీ లావణ్య తన వాదనలు వినిపించారు. సందీప్ నిందితుడిగా తేలడంతో అతడికి న్యాయమూర్తి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేలు, వరకట్న నిషేధ చట్టం కింద మరో రూ.10వేల జరిమాన విధించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు.
రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం, భారతినగర్ డివిజన్‌లలో బుధవారం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సింధు రెడ్డి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి డ్రైనేజీ సమస్యలను వివరించారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఈడీ సంతోష్ ఆదేశించారు. జల మండలి జీఎం ్డ, డీజీఎం పాల్గొన్నారు.


