హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన నా తమ్ముడు నరేశ్ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయగా వృథా కాలేదు. మా కుటుంబానికి గత ప్రభుత్వం రూ.10లక్షలిచ్చి, నాకు ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నేడు మెదక్‌లో ప్రభుత్వ హాస్టల్‌లో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నాను.
– నర్సింహులు, తెలంగాణ అమరవీరుడి సోదరుడు, శమ్నాపూర్
గత ప్రభుత్వంలో ఆదుకున్న విధంగానే తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న కుటుంబీకులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. కన్న కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త ఎప్పటికి మరిచిపోలేనిది. ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలకు న్యాయం చేసినప్పుడు వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది.
– తెలంగాణ అమరవీరుడి తల్లి
కమలమ్మ, రాజ్‌పేట


