ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వదీప్ కుమార్
మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో డిప్యూటీ వార్డెన్లు, కిచెన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వదీప్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీజీఎంఆర్‌జేసీ కళాశాలలో ఫుడ్‌సేఫ్టీ అంశంపై ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లాలోని తెలంగాణ గురుకుల మైనారిటీ పాఠశాలలు, జూనియర్ కళాశాలల డిప్యూటీ వార్డెన్లు, కిచెన్ సిబ్బంది హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథులుగా జిల్లా ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ స్వదీప్ కుమార్, ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ డాక్టర్ రాజ్‌కుమార్ హాజరై ఆహార భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ సురేఖ అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌ఎల్‌సీ బహుమతి, విజిలెన్స్ అధికారులు గౌస్ పాషా, జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


