గడ్డపోతారం కమిషనర్‌గా తాన్యా | - | Sakshi
Sakshi News home page

గడ్డపోతారం కమిషనర్‌గా తాన్యా

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం కమిషనర్‌గా తాన్య బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో కమిషనర్‌గా పనిచేసిన వెంకటరమయ్య సీడీఎంఏ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు.

ప్లాస్టిక్‌ రహిత

సమాజానికి కృషి

జహీరాబాద్‌ టౌన్‌: ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేద్దామని మున్సిపల్‌ చైర్మన్‌ యూనూస్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ నిషేధంపై బుధవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ కవర్లకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. అనంతరం కమిషనర్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకు ముందు మున్సిపల్‌ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు, ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘాల సభ్యులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

రోగులకు టీబీ పరీక్షలు

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని పీహెచ్‌సీ వైద్యులు అమృత్‌ రాజ్‌ జైన్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో బుధవారం ఉచిత టీబీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 40 మంది రోగులకు టీబీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్‌ నాగరాజు, వైద్య సిబ్బంది గోపిరాజ్‌, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ సిగ్నల్‌కు

మరమ్మతులు చేయండి

రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్‌ నుంచి విద్యుత్‌నగర్‌ వెళ్లే మార్గంలోని రైల్వే అండర్‌పాస్‌ వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సమస్యను వెంటనే పరిష్కారించాలని కొరుతూ పీఏసీఎస్‌ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌లు లచ్చిరాం నాయక్‌, బాలాజీలు బుధవారం ఉప కమిషనర్‌ జ్యోతి రెడ్డికు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రైల్వే అండర్‌పాస్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందన్నారు. త్వరలో పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్‌లకు మరమ్మతులు చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ శంషాబాద్‌ రాజు, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు రాజేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఉచిత శిక్షణ

జహీరాబాద్‌: బ్యూటీషియన్‌లో ఉచిత శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. బుధవారం పట్టణంలోని లతాస్‌ బ్యూటీ అకాడమీలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు 25 మంది యువతులకు నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అందించారు. సామాజిక సేవకురాలు, అకాడమీ నిర్వాహకురాలు లత ఆధ్వర్యంలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ పొందిన వారు బ్యూటీ పార్లర్‌ ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు. భవిష్యత్త్‌ల్లోనూ ఇలాంటి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ సిబ్బంది వనీల, లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement