హరీశ్‌ రావుకు శుభాకాంక్షల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

హరీశ్‌ రావుకు శుభాకాంక్షల వెల్లువ

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

రామచంద్రాపురం(పటాన్‌చెరు): మాజీ మంత్రి హరీష్‌ రావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వి.ఆదర్శ్‌ రెడ్డి నివాసంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సింధు రెడ్డి, అంజయ్యు, నాయకులు పరమేష్‌, భాస్కర్‌, నర్సింహ, దేవేందర్‌ చారీ, రాణి యాదవ్‌ పాల్గొన్నారు.

జిల్లా ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

సంగారెడ్డి: మాజీ మంత్రి హరీశ్‌ రావు జన్మదినం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ, అన్నదానం, రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, సదాశివపేటలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, డాక్టర్‌ శ్రీహరి, మాజీ సీడీసీ చైర్మన్‌ విజేందర్‌ రెడ్డి, చింత సాయినాథ్‌, వేణుగోపాలస్వామి, సునీల్‌ జై, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మహిళా కౌన్సిలర్ల పాదయాత్ర

జహీరాబాద్‌ టౌన్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు జన్మదినం పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ నాయకులు నామ రవికిరణ్‌ ఆధ్వర్యంలో మహిళా కౌన్సిలర్లు, పార్టీ నాయకులు బుధవారం సిద్ధివినాయక ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పట్టణం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర 15 కిలోమీటర్లు సిద్ధివినాయక ఆలయ వరకు కొనసాగింది. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు స్రవంతి, అన్నపూర్ణ, సుజిత, స్వప్న, పాండు, సర్పంచ్‌లు మహాదేవి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement