నారాయణఖేడ్: తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి నూతన నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడి తెలిపారు. మనూరు మండలంలోని బోరంచలో రూ.95లక్షల వ్యయంతో చేపట్టనున్న 4 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం పునరుద్ధరణ పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, దిగంబర్‌రెడ్డి, సిద్దారెడ్డి, బీరప్ప, సంజీవ్, శివాజీ పాటిల్, ఖరీం, రాజు, అఖిలేష్‌రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్ దోహదం
అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఖేడ్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో ఎమ్మెల్యే సైక్లింగ్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం పార్కు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే, పలుగు తండాలోని భవానీమాత ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి


