స్వచ్ఛ సిరిసిల్లకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ సిరిసిల్లకు ప్రాధాన్యం

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

సిరిసిల్లటౌన్‌: స్వచ్ఛ సిరిసిల్లకు తమ పాలకవర్గం ప్రాధాన్యత ఇస్తుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ అన్నారు. మంగళవారం 6వ వార్డులోని ప్రధాన మురికికాలువలో పూడిక తీత పనులను ప్రారంభించి మాట్లాడారు. వచ్చే వర్షాకాలం దృష్ట్యా ప్రధాన మురికికాలువలలో పూడిక తీయుటకు ప్రత్యేకంగా రూ.5లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈక్రమంలోనే నెహ్రునగర్‌ నుంచి గాంధీనగర్‌, అంబేద్కర్‌నగర్‌ మీదుగా శాంతినగర్‌ వరకు ప్రవహిస్తున్న ప్రధాన కాలువలో పూడికతీత పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. కొంతమంది నిర్లక్ష్యంగా కాలువల్లో చెత్త పడవేయడంతో నీటి ప్రవాహనాకి అడ్డు ఏర్పడి దోమలు, క్రిమి కీటకాలతో వృవొకశచెంది ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ ఖాదీర్‌పాషా, కౌన్సిలర్‌ దూడం రజిని శ్రీనివాస్‌, ఏఈ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్‌

ముస్తాబాద్‌: మండల వనరుల కేంద్రంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు పాఠ్య పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం వరకు పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ సరఫరా పూర్తి చేస్తామని ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. ఇప్పటికే బడిబాట కార్యక్రమం జరుగుతుందని, విద్యార్థుల చేరికలు జరుగుతున్నాయన్నారు. హెచ్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement