రాజన్నపై లడ్డూ భారం | - | Sakshi
Sakshi News home page

రాజన్నపై లడ్డూ భారం

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

యుద్ధ ప్రభావంతో ధరలకు రెక్కలు

లడ్డూ తయారీ సామగ్రి ఇలా..

పెరిగిన ధరలతో ఆదాయంపై ప్రభావం

2016 నుంచి రూ.20కే విక్రయం

పెరిగిన ధరలతో భారంగా ప్రసాదం తయారీ

ధరల పెంపు దిశగా దేవస్థానం అడుగులు

తేదీ: జూన్‌ 8 (సోమవారం) సమయం : మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలు ఫోన్‌ నంబరు : 89777 55264

సిరిసిల్ల: వర్షాకాలం ప్రవేశించింది. రోహిణీ కార్తె ముగింపు దశకు చేరింది. మృగశిర కార్తె సోమవారం ప్రవేశిస్తుంది. వానాకాలం ప్రారంభంలో కొద్దిపాటి తొలకరి జల్లులు పలకరించాయి. జిల్లాలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. మరోసారి మంచి వానలు పడితే విత్తనాలు వేసుకునేందుకు, నారు పోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతులు ఇప్పటికే పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ విత్తనాలు వేసుకున్నారు. రేగడి భూముల్లో పత్తి విత్తుకునేందుకు సిద్ధమయ్యారు.ఈ వానాకాలం సీజన్‌లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి విత్తనాలను ఎంచుకోవాలి. వర్షాలు ఆలస్యమైతే.. ఏయే పంటలు వేసుకోవాలి. సకాలంలో వర్షాలు పడితే ఎలాంటి పద్ధతులు పాటించాలి.. సాగులో ఉన్న సందేహాలు? జిల్లాలో ఎరువులు, విత్తనాల సరఫరా ఎలా ఉంది? అనే అంశాలతోపాటు రైతులకు వచ్చే అన్ని రకాల సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగంతో ఈనెల 8న ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ నిర్వహిస్తుంది. రైతుల సందేహాలకు జిల్లా వ్యవసాయాధికారి సమాధానాలు ఇస్తారు. రైతులు సద్వినియోగం చేసుకుని అనుమానాలను నివృత్తి చేసుకోవాలి.

అఫ్జల్‌ బేగం, జిల్లా వ్యవసాయాధికారి

వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం పెరిగిన ముడిసరుల ధరలతో తయారీ వ్యయం పెరిగిందని ఆలయ అధికారులు లెక్కలు వేస్తున్నారు. 2016లో నిర్ణయించిన రూ.20లకే ఒక లడ్డూ చొప్పున ఇప్పటికీ విక్రయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నెయ్యి, పంచదార, శనగపిండి, డ్రైఫ్రూట్స్‌ ధరలు పెరిగిపోయాయి. దీంతో లడ్డూ తయారీ వ్యయం పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ ధర పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరల ప్రభావం రాజన్న ప్రసాదాలపై పడింది. ప్రస్తుతం భద్రాచలం, బాసర, ధర్మపురి, కొండగట్టు ఆలయాల్లో ఒక్కో లడ్డూ ధర రూ.25గా ఉండగా, యాదాద్రి ఆలయంలో రూ.30కు విక్రయిస్తున్నారు. వేములవాడలో మాత్రం రూ.20కే విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో రమాదేవి ఆలయ అధికారులతోపాటు అర్చకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి లడ్డూ తయారీ ఖర్చు, నాణ్యత ప్రమాణాలు, ప్రస్తుత ధరల పరిస్థితులపై సమీక్షించనున్నారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించడంతోపాటు దేవస్థానానికి నష్టం లేకుండా ఉండేందుకు లడ్డూ ధర పెంపు అవసరమనే యోచనకు వచ్చినట్లు సమాచారం. త్వరలో ఉన్నతాధికారుల ఆమోదంతో లడ్డూ ధర పెంపుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్వల్పంగా ధర పెంచే ప్రతిపాదనపై అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లడ్డూతోపాటు పులిహోర ధర సైతం పెంచాలని ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement