చెత్తశుద్ధిపై చిత్తశుద్ధి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చెత్తశుద్ధిపై చిత్తశుద్ధి ఉండాలి

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

● చెత్తను నాలుగు రకాలుగా వేరుచేయాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● చెత్తను నాలుగు రకాలుగా వేరుచేయాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ పేర్కొన్నారు. ’ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భా గంగా శనివారం తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి లోని ప్రగతి ప్రాంగణంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మా ట్లాడుతూ వర్షాకాల సన్నద్ధత, ఘన వ్యర్థాల నిర్వహణ, బడిబాట, పంటల మార్పిడి, ఓటరు జాబి తా సవరణ తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చెత్తను ఇంట్లోనే నాలుగు రకాలుగా తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక చెత్తగా వేరుచేసి అందించాలన్నారు. జీపీ ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి నాలుగు చెత్త బుట్టలు, బట్ట సంచులు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. ‘బడిబాట’ ద్వారా ప్ర భుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు వ్యవసాయాధికారుల సలహాలతో సాగుచేయాలని తెలిపారు. ఆయిల్‌పామ్‌, సన్నవడ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు సాగుచేయాలని వివరించారు. వర్షపు నీటిని నిల్వ ఉంచి భూ గర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతలు, చెరువులు, పామ్‌పాండ్లను సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటికి వచ్చే బీఎల్‌వోలకు గుర్తింపుకార్డులు చూపించి మ్యాపింగ్‌ ప్రక్రియకు సహకరించాలని కోరారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్‌, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌, నయాబ్‌ తహసీల్దార్‌ మురళీకృష్ణ, సర్పంచ్‌ ఆత్మకూరి జ్యోతి పాల్గొన్నారు.

వడ్ల కొనుగోళ్లను పూర్తి చేయండి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లులు, గోదాములు, అపెరల్‌ పార్క్‌కు తరలించాలని ఆదేశించారు. ఈనెల 9న మహిళా సంఘాల మండల సమాఖ్యలకు బస్సుల పంపిణీని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీసీఎస్‌వో బుచ్చిబాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ నరసింహ, డీసీవో రామకృష్ణ, డీఏవో అఫ్జల్‌బేగం, డీటీవో శ్రీనివాస్‌, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, కార్మికశాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, తహసీల్దార్‌ మహేశ్‌ పాల్గొన్నారు. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement