సీసీ కెమెరాలకు మరమ్మతు | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలకు మరమ్మతు

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

సీసీ కెమెరాలకు మరమ్మతు

సిరిసిల్ల అర్బన్‌: ‘నిద్రపోతున్న నిఘా’ శీర్షికన ఆర్టీసీ బస్సుల్లో పనిచేయని సీసీ కెమెరాలపై ఈనెల 4న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సిరిసిల్ల ఆర్టీసీ డీపో మేనేజర్‌ ప్రకాశ్‌రావు మాట్లాడుతూ బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీసుశాఖ ఆధీనంలో ఉన్నాయని, వాటి పరిశీలనకు పోలీసు అధికారులను సంప్రదించినట్లు తెలిపారు. టెక్నీషియన్‌ను పంపించి మరమ్మతు చేయించేందుకు పోలీస్‌ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేస్తామని డీఎం హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement