ఆధునికీకరణతో మెరుగైన విద్యుత్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

ఆధునికీకరణతో మెరుగైన విద్యుత్‌ సేవలు

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

● టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

● టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన సేవలు అందించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడమే టీజీఎన్పీడీసీఎల్‌ ప్ర ధాన లక్ష్యమని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పే ర్కొన్నారు. పెద్దూరు బైపాస్‌రోడ్డులోని విద్యుత్‌ సంస్థ స్టోర్స్‌, తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్‌లోని సబ్‌స్టేషన్లను శుక్రవారం తనిఖీ చేశారు. స్టోర్స్‌లో వర్షాకాలంలో సామగ్రి పాడవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాలన్నారు. సిరిసిల్ల విద్యుత్‌ సంస్థ ఆఫీస్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా, నిర్వహణ, వినియోగదారుల సేవలు, భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్షించారు. కాలిపోయిన, పనిచేయని మీటర్లను మార్చాలన్నారు. వ్యవసాయ సర్వీసులు, టీజీఐ–పాస్‌లో సర్వీసులు యుద్ధప్రాతిపదికన రిలీజ్‌ చేయాలన్నారు. డిజిటల్‌ సేవలను విస్తరించేందుకు రూపొందించిన ఎల్‌టీఎంటీ యాప్‌ను ప్రారంభించారు. వేములవాడ మండలం రుద్రవరం 33/11 కేవీ ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన రియల్‌ టైమ్‌ ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ సేవల పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(ఈఆర్‌టీ) వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ టి.వేణుమాధవ్‌, డీఈఈలు అంజయ్య, వెంకటరమణ, ఏడీఈలు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement