ఆలయ ఆస్తులను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

ఆలయ ఆస్తులను కాపాడాలి

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

● కాంగ్రెస్‌ నాయకుడు ధర్మేందర్‌ నిరాహార దీక్ష

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్‌లో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకుడు తోట ధర్మేందర్‌ శువ్రారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ధర్మేందర్‌ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన భూములను సర్వే చేసి హద్దులను నిర్ణయించాలని కోరారు. దేవుడి బంగారు ఆభరణాల వివరాలు, ఆదాయ, వ్యయాలను ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సై జ్యోతి మాట్లాడుతూ దీక్షలు చేయవద్దని, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తామన్నారు. దీక్ష చేపట్టిన ధర్మేందర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్సై హామీ మేరకు దీక్షను విరమించినట్లు ధర్మేందర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement