ఆరోగ్య ప్రదాయిని | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ప్రదాయిని

Jun 5 2026 10:21 AM | Updated on Jun 5 2026 10:21 AM

యోగా

కరీంనగర్‌స్పోర్ట్స్‌: సంస్కృత పదం యుజ్‌ నుంచి పుట్టిన యోగా గురించిన ప్రస్తావనలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి 196 సూత్రాలతో యోగా సూత్రాలు గ్రంథాన్ని అందించి యోగాను ఒక క్రమ పద్ధతిలోకి తెచ్చారు. అందుకే ఆయన్ను యోగా పితామహుడు అంటారు. ఆ తర్వాత స్వామి వివేకానంద చికాగో ప్రసంగం ద్వారా దీనిని ప్రపంచానికి పరిచయం చేయగా.. నేడు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మన యోగా విశ్వవ్యాప్తమైంది.

ప్రయోజనాలు..

నిత్యం క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే కనీసం అరగంటపాటు ఆసనాలు, ప్రాణాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తపోటు అదుపులోకి వచ్చి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు, ఎముకలను దృఢంగా మార్చి శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది, దీర్ఘకాలిక నడుము నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక కోణంలో చూస్తే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసి మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. విద్యార్థులు, యువతలో మెదడు పనితీరును చురుగ్గా మార్చి మానసిక ఏకాగ్రత, మేధస్సు, జ్ఞాపకశక్తిని విపరీతంగా పెంచుతుంది. శ్వాస క్రియల(ప్రాణాయామం) ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి శరీరంలో రోగ నిరోధకశక్తి పెంపొంది సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.

కరీంనగర్‌లో యోగా ప్రస్థానం

ప్రస్తుతం మన కరీంనగర్‌ జిల్లాలో కూడా యోగా ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. యోగా రాష్ట్ర పోటీల్లో దశాబ్దకాలానికి పైగా జరుగుతున్న రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్టే చాంపియన్‌. నగరంలోని ఉద్యానవనాలు, సామాజిక కేంద్రాల్లో వయసుతో నిమిత్తం లేకుండా వందలాది మంది ఉదయాన్నే యోగాసనాలతో తమ రోజును ప్రారంభిస్తుండడం విశేషం. ఉమ్మడి కరీంనగర్‌ ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తూ.. యోగాను ఒక ప్రజాఉద్యమంగా మారుస్తుండడం శుభపరిణామం

కరీంనగర్‌ జనజీవనంలో నూతన చైతన్యం

విశ్వ వేదికపై మన యోగా

ఏకాగ్రత.. మేధస్సు.. సంపూర్ణ ఆరోగ్యం

భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా సాధన. నేడు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధంగా మారి గ్లోబల్‌ వేదికపై జగద్గురువుగా నిలిచింది. నిత్యం యోగా చేస్తే మానసిక ఏకాగ్రత పెరగడమే కాకుండా.. మేధస్సు వికసించి ఒత్తిడి లేని ప్రశాంత జీవనం సాధ్యమవుతుంది. కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా అంతర్గత ప్రశాంతతకు యోగా ఎంతగానో తోడ్పడుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement