పునాది లేని చోట శిఖరాలు ఎలా సాధ్యం? | - | Sakshi
Sakshi News home page

పునాది లేని చోట శిఖరాలు ఎలా సాధ్యం?

Jun 5 2026 10:21 AM | Updated on Jun 5 2026 10:21 AM

పునాది లేని చోట శిఖరాలు ఎలా సాధ్యం? పోస్టుల భర్తీ చేపట్టకపోవడమే..

మనం 2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని కలలు కంటున్నాం. కానీ ఒలింపియన్లను తయారు చేసే ప్రాథమిక కేంద్రాలైన పాఠశాలల్లోనే పీఈటీలు లేకపోవడం దారుణం. పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించకపోతే అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు ఎలా వస్తారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు పూర్వ వైభవం రావాలంటే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి.

– దూడం రమేశ్‌, రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌

తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో స్కూళ్లలో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్‌ డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే విద్యార్థులు బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల వైపు రావడానికి భయపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, మోడల్‌, గురుకుల పాఠశాలల్లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి.

– కంకటి అనూప్‌ కుమార్‌, కరీంనగర్‌ జిల్లా ప్రైవేట్‌ పీఈటీల సంఘం ప్రతినిధి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement