ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం

Jun 5 2026 10:21 AM | Updated on Jun 5 2026 10:21 AM

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని జవహర్‌లాల్‌నాయక్‌ తండాకు చెందిన భూక్య లలిత తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు ఎస్సై లక్ష్మణ్‌ గురువారం తెలిపారు. వివరాలు.. జవహర్‌లాల్‌నాయక్‌ తండాకు చెందిన భూక్య రమేశ్‌, తన భార్య లలిత మధ్య బుధవారం సాయంత్రం స్వల్పంగా గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన లలిత, తన ఇద్దరు పిల్లలు వర్షిత్‌, నిహాన్‌ను వెంటబెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఎవరికై నా వీరి ఆచూకీ తెలిస్తే వెంటనే వీర్నపల్లి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రుద్రంగి(వేములవాడ): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్లేశం అనే వ్యక్తి రుద్రంగి నుంచి కోనరావుపేట మండలం వట్టిమల్లకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రుద్రంగి–లింగంపేట అటవీ ప్రాంతంలో అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

బైక్‌ అదుపుతప్పి యువకుడికి..

ముస్తాబాద్‌: మండలంలోని ఆవునూర్‌ మానేరు వంతెనపై బైక్‌ అదుపుతప్పి యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. ముస్తాబాద్‌కు చెందిన డొక్క ప్రవీణ్‌ గురువారం రాత్రి సిరిసిల్ల నుంచి ముస్తాబాద్‌కు బైక్‌పై వస్తున్నాడు. ఆవునూర్‌ మానేరు వంతెనపైకి రాగానే బైక్‌ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కాగా, 108 అంబులెన్స్‌లో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement