కనిపించని గాయం | - | Sakshi
Sakshi News home page

కనిపించని గాయం

Jun 5 2026 10:21 AM | Updated on Jun 5 2026 10:21 AM

మనసులో మిగిలిన మాటలే

కనిపించని గాయాలవుతాయి

నవ్వుల వెనుక దాగిన బాధ

నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది

ఎవరూ చూడని ఆ వేదన

హృదయంలో అలలై ఎగసిపడుతుంది

ఒక మాట గుచ్చినప్పుడు

గుండె లోతుల్లో ముద్రపడుతుంది

కాలం గడిచినా కొన్ని జ్ఞాపకాలు

గాయాన్ని మళ్లీ మేల్కొలుపుతాయి

బయటకు బలంగా కనిపించినా

లోపల మనసు విరిగిపోతుంది

ఆత్మీయుల నిర్లక్ష్యం

ఆ గాయానికి మరింత నొప్పి ఇస్తుంది

ఆశలు చినిగిన ప్రతిసారి

మనసు మౌనంగా రోదిస్తుంది

కన్నీటి చుక్కలకే తెలుసు

ఆ బాధ ఎంత లోతైనదో

చెప్పలేని క్షణాలన్నీ

గుండెలో గుహలై నిలిచిపోతాయి

అయినా జీవితం ముందుకు నడుస్తుంది

కొత్త వెలుగులను వెతుకుతూ

కనిపించని గాయాలకూ ఒక రోజు

మాన్పు అనే ఉదయం వస్తుంది

ఆశ అనే చిన్న దీపమే

మనసుకు మళ్లీ బలం ఇస్తుంది

– నక్క శ్రీకర్‌

ఊరు: ఊటూరు

మానకొండూర్‌

కరీంనగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement