చందుర్తి(వేములవాడ): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. గురువారం మండలంలోని మల్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయని, కొన్ని కేంద్రాల్లో పూర్తి కావడంతో లారీల కొరత తీరుతుందన్నారు. గన్నీ సంచులు పంపించి కొనుగోళ్లు మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త పడాలని సూచించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం కళ్యాణి, ఆర్‌ఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సన్నవడ్ల సాగుపై దృష్టిపెట్టాలి
వేములవాడరూరల్: రైతులు ఆయిల్‌పాం, సన్నవడ్ల సాగుపై దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. గురువారం వేములవాడ పరిధిలోని బాలనగర్, వేములవాడ రూరల్ మండలం వట్టెంల, ఫాజుల్‌నగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. లాభదాయక పంటల సాగుకు ప్రోత్సాహం తదితర అంశాలపై రైతులతో చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేసేలా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.


