● పని చేయని బస్సుల్లోని సీసీ కెమెరాలు ● అలంకారప్రాయమే.. ● ఫలితాలు ఇచ్చినా నిర్లక్ష్యం ● పట్టించుకోని అధికారులు
సిరిసిల్ల అర్బన్: బస్సుల్లో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు చెక్ పెట్టడం.. దొంగతనాల నివారణకు ఆర్టీసీ, పోలీస్‌శాఖలు సంయుక్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాయి. అయితే నిర్వహణను పట్టించుకోకపోవడంతో పని చేయడం లేదు. నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నేడు ఒక్కటి కూడా పని చేయడం లేదు. ప్రస్తుతం అలంకారప్రాయంగానే దర్శనమిస్తున్నాయి.
సీసీ కెమెరాల ఏర్పాటు ఇలా..
వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో రెండు ఆర్టీసీ బస్సు డిపోలు ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో నాలు గేళ్ల క్రితం వేములవాడ డీపోకు చెందిన 40 బస్సులు, సిరిసిల్ల డిపోకు చెందిన 40 బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డిపో నుంచి బస్సు బయలుదేరినప్పటి నుంచి తిరిగి డిపోకు వచ్చే వరకు సీసీ కెమెరాలు పనిచేస్తుండేవి. దాని పుటేజీని ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులతో పాటు, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు పరిశీలించేవారు. ప్రస్తుతం కెమెరాలు పనిచేయకపోవడంతో వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు.
ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా
బస్సులో కిందికి చూస్తున్న సీసీ కెమెరా


