‘పుష్కర’మైన అభివృద్ధి జాడలు | - | Sakshi
Sakshi News home page

‘పుష్కర’మైన అభివృద్ధి జాడలు

Jun 2 2026 12:08 AM | Updated on Jun 2 2026 12:08 AM

‘పుష్కర’మైన అభివృద్ధి జాడలు

న్యూస్‌రీల్‌

రాజకీయ చిత్రం.. అభివృద్ధి మంత్రం

జిల్లాలో చేయాల్సిన పనులు

స్వరాష్ట్రంగా పన్నెండేళ్ల అడుగు జాడలు నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

విద్య, వైద్యరంగాల్లో...

రహ‘దారుల’ అభివృద్ధి

వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు

సర్ధాపూర్‌లో వ్యవసాయ మార్కెట్‌ యార్డు

నర్సింగ్‌ కాలేజీ

కలెక్టరేట్‌ ముఖద్వారం

సిరిసిల్ల: స్వరాష్ట్ర సాధనకు ముక్కోటి గొంతుకలు.. సబ్బండవర్ణాలు ఏకమై నినదించిన వేళ.. సరిగ్గా పుష్కరకాలం క్రితం.. దశాబ్దాల పోరాటం.. ప్రజల ఆరాటం ఫలించింది. భాష..యాస.. పాటలు.. మాటలతో సాగిన ఉద్యమం విజయతీరాలకు చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి నేటికి సరిగ్గా పన్నెండు ఏళ్లు అవుతుంది. పుష్కరకాలంగా స్వరాష్ట్రంలో ఆత్మగౌరవ పతాక రెపరెపలాడింది. రాష్ట్ర ఆవిర్భావంతో తలసరి ఆదాయం, సాగు విస్తీర్ణం పెరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం 2016లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించింది. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెలు ప్రగతి పథంలో పయణిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కథనం.

మండెపల్లిలో రాష్ట్రంలోనే తొలి డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం

వాటర్‌ జెట్‌ లూమ్స్‌

సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకంగా మారారు. పన్నెండేళ్లుగా జిల్లా అభివృద్ధికి ఇద్దరూ బాటలు వేస్తున్నారు. కలెక్టరేట్‌, జిల్లా పో లీస్‌ అధికారి ఆఫీస్‌ భవనాలు పూర్తయ్యాయి. సిరి సిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తారు రోడ్లు వేశారు. కొత్తగా 56 జీపీలు ఆవిర్భవించా యి. స్వచ్ఛ భారత్‌లో జిల్లా ఆదర్శం. వంద శాతం పన్నుల వసూలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి సామాజికాంశాల్లోనూ జిల్లా అగ్రపథం. భూగర్భ జలాల అభివృద్ధి శిక్షణ ఐఏఎస్‌లకు పాఠ్యాంశం.

ఎగువ మానేరుకు మధ్యమానేరు నీరు చేరాలి.

జిల్లాలోని 625 చెరువుల్లోకి గోదావరి జలాల మళ్లింపు.

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు.

సిరిసిల్ల, వేములవాడల్లో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల ఏర్పాటు.

టెక్స్‌టైల్‌ రంగంపై యువతకు శిక్షణ కేంద్రం ఏర్పాటు.

వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ.

బీడీ కార్మికుల ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనం నిర్మాణం.

మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం.

ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి.

వేములవాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు పూర్తి.

వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ.

మూలవాగుపై పలు ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం.

వేములవాడ, సిరిసిల్ల పట్టణాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.

జిల్లాలో మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చాలి.

గల్ఫ్‌ వలస జీవులకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి.

మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీలు మంజూరు కావడంతో వైద్యరంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఎంబీబీఎస్‌ రెండో ఏడాది విద్యను వంద మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులు ప్రభుత్వ వైద్యశాలల్లో శిక్షణ పొందుతూ పేదలకు సేవలు అందిస్తున్నారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ మంజూరు కావడంతో అగ్రహారంలో కొనసాగుతోంది. సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలి కేజీ టు పీజీ విద్యాలయం గంభీరావుపేటలో ఉంది. వేములవాడ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది.

జిల్లాలో పంచాయతీరాజ్‌ పరిధి(పీఆర్‌)లో రూ.525.61 కోట్లతో 825.22 కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్లు వివిధ గ్రామాల్లో వేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ.391.04 కోట్లతో 28 రోడ్లను, మరో నాలుగు వంతెనలను నిర్మించారు. సిరిసిల్ల పట్టణంలో రూ.79 కోట్లతో రోడ్ల విస్తరణ చేశారు. రెండో బైపాస్‌ రోడ్డు రగుడు నుంచి వెంకటాపూర్‌ వరకు రూ.90 కోట్లతో పూర్తయింది.

వస్త్రపరిశ్రమలో ఎన్నడూ లేని మార్పులు వచ్చాయి. 2017 నుంచి ప్రభుత్వం ఆర్వీఎం, బతుకమ్మ చీరలు, క్రిస్మస్‌, రంజాన్‌ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇస్తుంది. గతేడాది రూ.350 కోట్ల ప్రభుత్వ ఆర్డర్లు స్థానిక వస్త్రపరిశ్రమకు లభించాయి. 1,104 మంది కార్మికులను యజమానులుగా మార్చేందుకు రూ.202.30 కోట్లతో 80 ఎకరాల్లో సామూహిక వర్క్‌షెడ్లు పూర్తయ్యాయి. కానీ ఆ షెడ్లను ధాన్యం నిల్వ చేసేందుకు వినియోగిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement