ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు

Jun 2 2026 12:08 AM | Updated on Jun 2 2026 12:08 AM

నూతన వస్త్రాలు అందిస్తున్న కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, విప్‌ ఆది శ్రీనివాస్‌, తడగొండలో ఎమ్మెల్యే సత్యం

సిరిసిల్ల/రుద్రంగి/బోయినపల్లి: జిల్లా వ్యాప్తంగా సోమవారం సామూహిక ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు సంతోషాల మధ్య జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 1,720 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని పలు ఇళ్లను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి కలిసి ప్రారంభించారు. రుద్రంగి మండల కేంద్రంలో కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌తో కలిసి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి, ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ మోడల్‌హౌస్‌తోపాటు తడగొండ, బోయినపల్లి, గుండన్నపల్లి గ్రామాల్లో గృహప్రవేశాలకు కలెక్టర్‌తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. హౌసింగ్‌ పీడీ వెంకటమాధవరావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా, ఏఎంసీ చైర్మన్‌ ఎల్లేశ్‌యాదవ్‌, తహసీల్దార్‌ చిందం శ్రీనివాస్‌, ఎంపీడీవో జయశీల పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement