జిల్లాలో 2014లో సాగువిస్తీర్ణం 1,44,260 ఎకరాలు ఉండగా.. ఇప్పు డు 2.46 లక్షల ఎకరా లకు పెరిగింది. మధ్యమానేరు జలాశయం నిర్మాణంతో భూగర్భ జలా లు పెరిగాయి. సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు ద్వారా గంభీరావుపేట మండలం నర్మాల జలాశయంలోకి గోదావరి జలాలు చేరి, ఎండాకాలంలో ఎగువమానేరు మత్తడి దూకింది. వ్యవసాయాభి వృద్ధికి 10 గోదాములు నిర్మించారు. చెరువులు, కుంటల అభివృద్ధికి రూ.96.09 కోట్లు కేటాయించారు. మిషన్‌భగీరథలో రూ.1,220కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందించే పనులు చేపట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్యాకేజీ–9లో భాగంగా రూ.1,280కోట్లతో ఎగువ మానేరుకు టన్నెల్ పనులు పూర్తయ్యాయి. కోనరావుపేట మండలం మ ల్కపేట రిజర్వాయర్‌లో రెండు టీఎంసీల నీటిని నిల్వచేసి ఆయకట్టుకు విడుదల చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గుడి చెరువు అభివృద్ధి పనులు సాగుతున్నాయి.


