● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే బాధితుల కళ్లల్లో ఆనందాన్ని చూసేలా సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించగా.. 33 మంది ఫిర్యాదులు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును లోతుగా పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరిధిలో న్యాయం చేయాలని సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలతో నేరుగా ఎస్పీ మాట్లాడి, ఫిర్యాదులపై సత్వరం స్పందించాలని ఆదేశించారు.


