భీమన్నా శరణు శరణు | - | Sakshi
Sakshi News home page

భీమన్నా శరణు శరణు

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

వేములవాడ: భీమేశ్వరస్వామిని ఆదివారం వి విధ ప్రాంతాలకు చెందిన 30 వేల మంది భ క్తులు దర్శించుకున్నారు. బద్దిపోచమ్మకు బో నం మొక్కు చెల్లించుకున్నారు. కోడెమొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, సత్యనారాయణ వ్రతాలు, కుంకుమ పూజలు చేశారు.

ధాన్యం సేకరణ వేగంగా చేయాలి

వీర్నపల్లి(సిరిసిల్ల): ధాన్యం సేకరణ, లోడింగ్‌, మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఆదేశించారు. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఆదివారం తనిఖీ చేశారు. సరిపడా వాహనాలు అందుబాటులో ఉంచేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. హమాలీల సంఖ్య పెంచుకొని ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. తహసీల్దార్‌ నారాయణరెడ్డి ఉన్నారు.

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని నేరళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో రజిత మాట్లాడుతూ పొగాకు వినియోగంతో ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్లు, గుండె జబ్బులు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. నేరళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి చంద్రికారెడ్డి, జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి రామకృష్ణ, డాక్టర్‌ నయీమా, సీహెచ్‌వో సత్యనారాయణ, సర్పంచ్‌ పొన్నం లక్ష్మణ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

రాజన్న కోడెలకు పశుగ్రాసం

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని కస్బేకట్కూర్‌ గ్రామం చింతలకుంటకు చెందిన యువ రైతులు చీమల ప్రశాంత్‌యాదవ్‌, జడల శ్రీనివాస్‌ రాజన్న కోడెలకు పశుగ్రాసం అందజేశారు. ఆదివారం కస్బేకట్కూర్‌ నుంచి ట్రాక్టర్‌ లోడు పశుగ్రాసాన్ని వేములవాడ రాజన్న గోశాలకు తీసుకెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement