సిరిసిల్లటౌన్: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని టీజీఎస్‌ఆర్టీసీ సిరిసిల్ల డిపో జేఏసీ చైర్మన్ సీహెచ్ బాణయ్య కోరారు. రాష్ట్రశాఖ పిలుపుమేరకు ఆదివారం ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. బాణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట మార్చకుండా జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్‌మెంట్ డేట్ ప్రకటించాలని కోరారు. ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకు మొదటి బస్సు నుంచి డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ‘డిమాండ్స్ డే’లో పాల్గొన్నారు. సిరిసిల్ల డిపో ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస్, బీ.ఎస్.ఎన్. రావు, ఉద్యోగులు పాల్గొన్నారు.
అపాయింట్‌మెంట్ తేదీ ప్రకటించాలి
వేములవాడఅర్బన్: వేములవాడ ఆర్టీసీ డిపో కార్మికులు ఎర్రబ్యాడ్జీలతో ఆదివారం డిపో ఎదుట నిరసన తెలిపారు. జూన్ 2న టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అపాయింట్‌మెంట్ తేదీ ప్రకటించాలని కోరారు. ఈ నిరసనలో శ్రీకాంత్, కాళిదాస్, జీపీ సింగ్ తదితరులు ఉన్నారు.


