కొనుగోళ్లలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో వేగం పెంచాలి

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

● గోదాముల్లో హమాలీల సంఖ్య పెంచాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● గోదాముల్లో హమాలీల సంఖ్య పెంచాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కొనుగోళ్లు, అన్‌లోడింగ్‌, వాహనాలు, ఇతర అంశాలపై సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని అపరెల్‌పార్క్‌లో పౌర సరఫ రాలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి, సహకార, మెప్మా, రవాణా, కార్మిక శాఖ అధికారులు, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌తో కలిసి ఆదివారం సమీక్షించారు. అపెరల్‌ పార్క్‌లో ధాన్యం అన్‌లోడింగ్‌ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, హమాలీల సంఖ్య, గన్నీసంచుల వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన గన్నీసంచులు ముందస్తుగా తెప్పించాలని సూచించారు. కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు, వాహనాలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లు వాహనాలు సమకూర్చాలని ఆదేశించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సహకారశాఖ అధికారి రామకృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌కుమార్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, కార్మిక శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, తహసీల్దార్‌ మహేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement