ఇల్లంతకుంట(మానకొండూర్): బట్టలు కుడుతూ జీవనోపాధి వెల్లదీస్తున్న కుటుంబంలో నుంచి ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు ఆర్మీకి ఎంపికవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. మండల కేంద్రానికి చెందిన ఓదెల లక్ష్మణ్–అనిత దంపతులకు ఇద్దరు కొడుకులు ఆనంద్, శివ. లక్ష్మణ్ దర్జీ పనిచేస్తూ పిల్లలను చదివిపించాడు. ఆనంద్, శివ ఇద్దరూ డిగ్రీ వరకు చదివారు. మొదటిసారి గత జూన్‌లో గోదావరిఖనిలో నిర్వహించిన ఆర్మీ సెలక్షన్స్‌కు హాజరై పరీక్ష రాశారు. హనుమకొండలో ఫిజికల్ టెస్టులో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ఆర్మీ జీడీ పోస్టులకు ఎంపికయ్యారు.


