● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
సిరిసిల్ల: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐఎంయూ, ఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, మెటర్నిటీ వార్డుల్లో పరిశీలించి.. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. రోజు ఎంత మంది పేషెంట్లు వస్తున్నారో తెలుసుకున్నారు.
వైద్యసేవలు ఎలా ఉన్నాయి?
ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని కలెక్టర్ ఆరా తీశారు. చికిత్స పొందుతున్న చిన్నారితో ఉన్న మహిళతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఎంవో సుమన్‌మోహన్‌రావు, వైద్యులు సంతోష్, తహసీల్దార్ మహేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా ఉన్నారు.
1న ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు
జిల్లా వ్యాప్తంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల సా మూహిక గృహ ప్రవేశాలు జూన్ 1న నిర్వహించాల ని కలెక్టర్ ఆదేశించారు. మండలాల ప్రత్యేకాధి కారులు, ఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలన్నారు.
పర్యావరణంపైనా...
పర్యావరణంపైనా జూన్ 1 నుంచి 12 వరకు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్‌బేగం, ఉద్యానవన అధికారి శరత్ పాల్గొన్నారు.


