● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ ● ఎస్పీ మహేశ్ బీ గీతే
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాభద్రతే పోలీస్ పరమావధి అని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో 101 సీసీ కెమెరాలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. నేరాలు, దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నేరస్తులకు శిక్షలు పడేలా డిజిటల్ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. అన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ కోరారు. గూడెంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ నాగేంద్రచారి ప్రారంభించారు. సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్సై గణేశ్, ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, ఆత్మ డివిజన్ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్‌రావు, సర్పంచులు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, శంకర్, చిగురు నరేశ్, శ్రీనివాస్, ఆంజనేయులు, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు విజయ్‌రెడ్డి, నాయకులు సందుపట్ల అంజిరెడ్డి, వైద్యులు రాజారాం, శంకర్, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.


