● వీవోఏలకు విమలక్క సంఘీభావం
వేములవాడఅర్బన్: ఐకేపీ వీవోఏలకు శ్రమకు తగ్గ వేతనం అందించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్‌పర్సన్ విమలక్క కోరారు. వేములవాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఐకేపీ వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు శనివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీవోఏలకు గౌరవ వేతనం కాదు జీతాలు కావాలని కోరుతున్నారన్నారు. గతంలో మంత్రి సీతక్కను కూడా కలిసి తమ గోడు విన్నవించారని గుర్తు చేశారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క స్పందించి వీరికి న్యాయం చేయాలని కోరారు.
దుండ్రపల్లిలో డీఎస్పీ విచారణ
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని దుండ్రపల్లికి చెందిన సందీప్‌రెడ్డిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు విషయంలో శని వారం రాత్రి వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. సందీప్‌రెడ్డి తనను కులం పేరుతో దూశించాడని అదే గ్రామానికి చెందిన జంగం అంజయ్య ఫిర్యాదుతో పోలీ సులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కేసు విషయంలో డీఎస్పీ శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రమాకాంత్ ఉన్నారు.


