● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: విద్యార్థులు చదువుతోపాటు సమాజాన్ని చదవాలని, ఏం జరుగుతుందో అవగాహన పెంచుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయాన్ని పలువురు విద్యార్థినులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ అంటే ఏమిటి, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలా పనిచేస్తుంది.. అనే వివరాలు తెలుసుకోవాలన్నారు. ఎస్పీ చాంబర్, స్పెషల్ బ్రాంచ్, రిసెప్షన్, డీసీఆర్‌బీ, పరిపాలన విభాగం, ఆర్ముడ్ రిజర్వ్ విభాగం, ఐటీ కోర్, సైబర్ క్రైం, షీటీమ్, భరోసా, జాగిలాల విభాగం, పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆధునిక ఆయుధాలు, వాహనాల విభాగంతోపాటు ఇతర శాఖలను సందర్శించారు. ఎస్‌బీ డీఎస్పీ జి.వెంకటేశ్వర్లు, సీఐ రవి, ఆర్‌ఐ సురేశ్, ఆర్‌ఎస్సై దిలీప్, ఐకేపీ ఏపీఎం చంద్రయ్య పాల్గొన్నారు.


