● చైర్మన్ పుల్కం రాజు ● వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు
వేములవాడ: పట్టణంలోని ఫంక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్‌ప్లేట్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు తెలిపారు. శనివారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 52 ఎజెండా అంశాలపై చర్చించారు. చైర్మన్ రాజు మాట్లాడుతూ 203 మంది పారిశుధ్య కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేయకుండా 500 బోర్డుల ఏర్పాటు, రోడ్లపై కోనో కార్పస్ చెట్ల తొలగింపుపై చర్చించినట్లు వివరించారు. మున్సిపల్‌కు జేసీబీ కొనుగోలు రద్దు చేసి చెత్త సేకరణకు 4 కొత్త ట్రాలీ ఆటోల కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. విలీన గ్రామాల్లో గుంతల రోడ్లకు మోక్షం కల్పించి మట్టితో పూడ్చివేత పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కమిషనర్ లోకేశ్ పాల్గొన్నారు.


