లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలి

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

● అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఒంటికాలిపై వీవోఏల నిరసన బోగస్‌ ఓట్ల తొలగింపునకు కృషి చేయాలి డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు 1న సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

● అదనపు కలెక్టర్‌ నగేశ్‌

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వేగవంతంగా జరగాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ సూచించారు. మండలంలోని దాచారం, పెద్దలింగాపూర్‌, చిక్కుడువానిపల్లి కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వర్షానికి ధాన్యం తడిసిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. టార్పాలిన్‌ కప్పడంతో ధాన్యం తడవలేదని రైతులు చెప్పారు. లోడింగ్‌ చేసిన వాహనాల వెంట హమాలీలు వెళ్లి అన్‌లోడింగ్‌ చేస్తే త్వరగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. తహసీల్దార్‌ సురేశ్‌, సీసీ రామచంద్రం, ఉపసర్పంచ్‌ చిక్కుడు సత్యం, వీవోఏ కరుణ, ఎండీ ఆఫీఝా పాల్గొన్నారు.

చందుర్తి/గంభీరావుపేట/ఇల్లంతకుంట: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వీవోఏలు చేపట్టిన సమ్మె 11 రోజులకు చేరింది. చందుర్తిలో శుక్రవారం ఒంటికాలిపై నిరసన తెలి పారు. గంభీరావుపేటలో వీవోఏల సమ్మెకు తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) నాయకులు సుధాకర్‌శర్మ, సుమలతశర్మ, కూర సురేష్‌, సతీష్‌ మద్దతు ప్రకటించారు. ఇల్లంతకుంటలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కనీస వేతన చట్టం కింద రూ.20వేలు చెల్లించాలని కోరారు. వీవోఏలు స్వరూప, నక్క కవిత, సువర్ణ, శేషాద్రి, రజిత, అంజలి, వీణ, మమత, విజయలక్ష్మి, వినోద, కల్పన, స్వప్న, లావణ్య, గంగ, గొడుగు బాలలక్ష్మి, మహంకాళి ఉమారాణి, బంగారు అంజలి, కాసుపాక రాణి పాల్గొన్నారు.

వేములవాడరూరల్‌: బోగస్‌ ఓట్లను తొలగించేలా ప్రతి ఒక్కరు పని చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్‌రావు కోరారు. వేములవాడ రూరల్‌ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ‘సర్‌’పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సురేందర్‌రావు మాట్లాడుతూ బోగస్‌ ఓట్లను గుర్తించి, తొలగించేలా బూత్‌ అధ్యక్షులు, బీఎల్‌ఏ–2లు, పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ తహసీల్దార్‌ ఆఫీస్‌ ముట్టడించారు. తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్‌, సర్పంచ్‌ జంకె మధు, సాండేసారి మల్లికార్జున్‌, మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి పరశురాములు, మండల ఉపాధ్యక్షులు లింగంపల్లి కుంటయ్య, నల్ల వెంకటరెడ్డి, లింగంపల్లి కిషోర్‌, జంగం వంశీ తదితరులు పాల్గొన్నారు.

రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలో శుక్రవారం డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఎస్సై మోతీరాంనాయక్‌ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. పోలీస్‌ సిబ్బంది పద్మారావు పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూన్‌ 1న 12వ మెన్‌ అండ్‌ ఉమెన్‌ సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్‌ తెలిపారు. అండర్‌ 16, 18, 20 వయసు బాల,బాలికలు, మెన్‌ అండ్‌ ఉమెన్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జూన్‌ 1న పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించి, విజేతలకు మెడల్స్‌, సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వారు జూన్‌ 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement