వేస్ట్ డీకంపోజర్ మార్కెట్‌లో చౌకగా లభిస్తుంది. దాన్ని పొలంలో చల్లి దున్నితే సులభంగా గడ్డి కుళ్లిపోయి భూసారం పెంపొందుతుంది. ఆ దిశగా రైతులు ముందుకెళ్లాలి. కానీ క్షేత్రస్థాయిలో మేమూ, మా వ్యవసాయాధికారులు రైతులకు చెబుతున్నాం. రైతులు వినకుండా పొలంలోని కొయ్యకాలును కాలబెడుతూనే ఉన్నారు. ఇది తప్పుడు పద్ధతి అని చెప్పినా వినడం లేదు. పొలంలో కొయ్యకాలును కలియదున్నితే పంట అవశేషాలు కుళ్లిపోయి కావాల్సిన పోషకాలు అందుతాయి. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చు. బహుముఖ ప్రయోజనాలను గుర్తించి కొయ్యకాలు, పంట అవశేషాలను కాల్చ కుండా కలియ దున్నితే మేలు జరుగుతుందని గుర్తించాలి. ఇకపై ఎవరైనా కొయ్యకాలు కాల్చితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. – అఫ్జల్ బేగం, జిల్లా వ్యవసాయాధికారి


