సిరిసిల్లను వదలని వరదల భయం ఎండాకాలం వర్షాలకే ముంచెత్తుతున్న వరదలు వర్షాకాలం పోటెత్తే సమస్యపై ఆందోళన వరుస వరదల బీభత్సంపై వీడని భయం లోతట్టు ప్రాంతాల వాసుల్లో ఆందోళన పూర్తి కాని వరదకాల్వ పనులు
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రాన్ని వరదల భయం వీడ డం లేదు. వర్షాకాలం వస్తుందంటే చాలు సిరిసిల్ల లోని లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనగా రో జులు గడపాల్సిన దుస్థితి. ఎగువ ప్రాంతాల నుంచి పట్టణంలోకి వచ్చే వరదను సరైన మార్గంలో మళ్లించే ప్రణాళిక లేక ఏళ్లుగా వరదలతో వెల్లదీస్తున్నారు.
పనుల్లో నిర్లక్ష్యం
పట్టణంలో వరదల నివారణకు కోట్లాది రూపాయలతో చేపడుతున్న పనులు పూర్తికాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం నుంచి పలు దఫాలుగా మంజూరైన నిధులతో వెంకంపేట వద్ద దోభీఘాట్, కలెక్టరేట్ సమీపంలో ప్రహరీ, వరదల తాకిడికి దెబ్బతిన్న రోడ్లు, మురుగుకాల్వలు, ఫుట్‌పాత్‌లు, కల్వర్టుల మరమ్మతు పనులు చేపట్టారు. వీటిలో శాంతినగర్ నుంచి శ్రీనగర్ గుండా వరదకాల్వ పనులు పూర్తికాలేదు. నాలాలు, డ్రెయినేజీలు పూర్తికాలేదు.
సమస్యలు.. పరిష్కారాలు
ఇది గతేడాది వానాకాలంలో సంజీవయ్యనగర్‌లోని దుస్థితి. చిన్నపాటి వర్షానికే ఇక్కడి కాలనీలు, ప్రధాన రహదారిపై వరద ఏరులై పారుతుంటుంది. డ్రెయినేజీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండడమే ప్రధాన సమస్య. గతంలో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి నిర్మించిన డ్రెయినేజీ కాల్వ నిర్మించినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికీ చిరుజల్లులకే ఈ ప్రాంతంలో వరద వస్తుంటుంది.
గతేడాది వర్షాకాలంలో సిరిసిల్లలో కురిసిన భారీ వర్షానికి శ్రీనగర్, చుట్టుపక్కల కాలనీలు జలమయ్యాయి. ఏళ్లుగా వరదను కచ్చా కాల్వా ద్వారా తరలిస్తుండడంతో తలెత్తుతున్న వరదల పరిస్థితికి నిలువుటద్దం. ఏటా శాశ్వత పరిష్కారం చూపుతామంటున్న పాలకులు, అధికారులు మాట దాటవేయడం పరిపాటిగా మారింది. మరి కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ ప్రాంత ప్రజల్లో ఇప్పటికీ వరదల భయం వెంటాడుతుంది.


