ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని సత్సంగ సదనం సరస్వతీ గోవిందారాజుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ధర్మరాజు పట్టాభిషేకం కనులపండువగా నిర్వహించారు. వేములవాడ పురోహితులు ఆదిత్యశర్మ, శరత్‌శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 20న ఆరంభమైన మహాభారత జ్ఞానయజ్ఞంలో భాగంగా గురువారం శృంగేరి శారద పీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ మహాభారతాన్ని ప్రవచించారు. ధర్మరాజు పట్టాభిషేకం ఘట్టాన్ని కనులకు కట్టినట్లు వివరించారు. సత్సంగ సదనం అధ్యక్షుడు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, కార్యదర్శి నగుబోత్ శ్రీనివాస్ దంపతులు మహేశ్వరశర్మను సన్మానించారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, పద్మక్క, అంజమ్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


