ఎల్లారెడ్డిపేట/సిరిసిల్లఅర్బన్(సిరిసిల్ల): అన్ని సా మాజిక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వే స్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లోని ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం నివాసంలో గురువారం రాత్రి నిర్వహించిన బక్రీద్ వేడుకలకు హాజరయ్యారు. కేక్ కట్ చేసి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ రామ్‌రెడ్డి, ఉపసర్పంచ్ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.
గిన్నిస్ రికార్డ్‌కు ఆది మద్దతు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించే కోటి సూర్యనమస్కారాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మద్దతు ప్రకటించినట్లు తపోవన యోగా సొసైటీ చీఫ్ కోఆర్డినేటర్, యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ తెలిపారు. వేములవాడలోని తన నివాసంలో కలిసి మద్దతు కోరారు. యోగా సొసైటీ అధ్యక్షుడు మండల సత్యం, పతంజలి చందుర్తి మండల అధ్యక్షుడు గొట్టె ప్రభాకర్ పాల్గొన్నారు.


